అది నిజమని నిరూపిస్తే బహిరంగ క్షమాపణలు చెబుతా.. జగన్‌కు మంత్రి సవాల్
అధికారం లేదన్న నిరాశ జగన్‌లో స్పష్టంగా కనిపిస్తోందని ఏపీ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో 52 వేల మందిని రిక్రూట్ చేశామని జగన్ అబద్ధం చెప్పారని విమర్శించారు. అది నిజమని నిరూపిస్తే జగన్‌కు బహిరంగ క్షమాపణలు చెబుతానని ఆయన సవాల్ విసిరారు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల కొరత 4 శాతం అనడం హాస్యాస్పదంగా ఉందన్న మంత్రి.. జగన్ పాలనలో ఆ కొరత 59 శాతంగా ఉందని పేర్కొన్నారు.