తుంగతుర్తి: కోతుల స్వైర విహారం
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. రైతులకు ప్రయాణికులకు వాహనదారులకు కోతుల బెడద వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రభుత్వం అధికారులు స్పందించి కోతులపై చర్యలు తీసుకోవాలని తమ పంట పొలాలు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలపై కూడా కోతులు దాడులు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి.