
సూర్యాపేట: కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ ఫైర్
ప్రజా గాయకుడు గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వమని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సోమవారం మండిపడ్డారు. “గద్దర్ కు అవార్డు ఇవ్వలేకపోతే ఇవ్వొద్దు అంతేకానీ ఆయనను నక్సలైట్ వాది అని చెప్పడం మాత్రం విడ్డూరం. దళిత, ప్రజా, సాహిత్య ఉద్యమాలకు వెన్నెముక అయిన గద్దర్ ను నక్సలైట్ గా చూడటం మీ పార్టీ భావదారిద్య్రనికి నిర్శనం” అని పేర్కొన్నారు.