ఇటీవల కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్ ఎన్నికైన విషయం తెలిసిందే. తాను పదవిలో ఉండగా మూడు బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందని అన్నారు. తుంగతుర్తికి ఎమ్మెల్యే మందుల సామేలు పెద్దకొడులాంటి వాడు, తాను చిన్న కొడుకు లాంటి వాడినని ఆయన చెప్పారు. సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తేవాలని ప్రజలకు సూచించారు. అటు సీఎం రేవంత్ రెడ్డితో, పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మందుల సామేలుతో సమన్వయంతో పనిచేస్తానని అన్నారు.