TG: పుట్టెడు దుఃఖం.. ఓకే రోజు తండ్రి, కుమార్తె మృతి

18963చూసినవారు
TG: పుట్టెడు దుఃఖం.. ఓకే రోజు తండ్రి, కుమార్తె మృతి
నిజామాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. రెంజల్‌ (M) వీరన్నగుట్టకు చెందిన జ్యోతి అనే మహిళ భర్త వేధింపులు తాళలేక ఈ నెల 21న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న జ్యోతికి తన తండ్రి భోజనం తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. బాధను తట్టుకోలేక తండ్రి చనిపోయిన నిమిషాల వ్యవధిలోనే కుమార్తె జ్యోతి చనిపోవడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.