కేరళలో ఇళ్లలోకి దూసుకొచ్చిన సముద్రం (వీడియో)

55చూసినవారు
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి సముద్రం ముందుకు వచ్చింది. అలల తాకిడికి తీర ప్రాంతాల్లోని పలు నివాసాలు నీట మునిగాయి. కుంభవృష్టి కారణంగా నదులు ఉద్ధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు వర్షం కారణంగా బుధవారం ఉదయం ఇంటి వెనుక గోడ కూలడంతో నలుగురు మృతి చెందారు. మధువాహిని నది పొంగి ప్రవహించడంతో ప్రసిద్ధి చెందిన మధుర్ సిద్ధివినాయక్ మదానందేశ్వరం జలమయమైంది.

ట్యాగ్స్ :