మహా కుంభమేళాలో తొలిసారిగా అండర్ వాటర్ డ్రోన్స్
మహా కుంభమేళాకు వేళాయింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళా జరగనుంది. అయితే ఈ సారి సరికొత్తగా ఓ టెక్నాలజీని వినియోగించబోతున్నారు. ఈసారి మహాకుంభమేళాలో అండర్ వాటర్ డ్రోన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికోసం ఇప్పటికే ట్రయిల్స్ కూడా నిర్వహించారు. మహాకుంభమేళాలో స్నానమాచరిస్తూ పొరపాటున ఎవరైనా నీళ్లలోకి మునిగిపోతే తక్షణమే అండర్ వాటర్ డ్రోన్లు గుర్తించి కాపాడుతాయి.