మున్సిపాలిటీలలో ఇంటింటికి తాగునీరు: మంత్రి నారాయణ
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో మంత్రి నారాయణ శుక్రవారం పర్యటించారు. నెల్లూరు నగరానికి తాగునీరు అందించే పథకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఇంటింటికి తాగునీరు ఇచ్చేందుకు ప్రణాళికను రూపొందించామని తెలిపారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సాయంతో ఈ తాగునీటి పథకం పనులు చేపడతామన్నారు. 2028లోగా పనులు పూర్తి చేస్తామన్నారు.