CRPF డీజీగా వితుల్ కుమార్
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్‌గా వితుల్ కుమార్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న అనిష్ దయాల్ సింగ్ ఉద్యోగ విరమణ చేశారు. దీంతో CRPF డీజీ పదవికి శాశ్వత నియామకం జరిగే వరకు ఆ బాధ్యతలను వితుల్ కుమార్ నిర్వహించనున్నారు. వితుల్ కుమార్ ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 1993 బ్యాచ్ IPS అధికారి. ప్రస్తుతం CRPFలోనే ప్రత్యేక డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.