AP: చిత్తూరు జిల్లా రామానాయుడు పల్లెలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… దివ్యాంగుల పెన్షన్లు రూ. 6 వేలకు పెంచామని, 8 లక్షల మంది దివ్యాంగులకు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. పింఛన్లు ఇంటికే వెళ్లి ఇవ్వాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు చెప్పాం. ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు, కష్టాలు తెలియవు. క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.