AP: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలంలోని ఏటికొప్పాకకు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఏటికొప్పాక లక్క బొమ్మలకు శనివారం రాష్ట్రపతి భవన్ గుర్తింపునిచ్చింది. రాష్ట్రపతి భవన్‌లో ఏటికొప్పాక లక్క బొమ్మల స్టాల్ ఏర్పాటుకు అంగీకారం వచ్చింది. స్టాల్ ఏర్పాటుకు శరత్ అనే కళాకారుడిని కేంద్రం ఎంపిక చేసింది. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.