చంద్రబాబు, పవన్ న్యాయం చేయాలి: వాలంటీర్లు
తమకు తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వాలంటీర్లు వేడుకున్నారు. తక్షణమే తమను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం.. తమను విధుల్లోకి తీసుకోవడంతో పాటు రూ.10 వేల వేతనం ఇవ్వాలన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఆదేశాల ప్రకారం పని చేస్తామని వాలంటీర్లు తెలిపారు. ప్రభుత్వం మానవతా ధృక్పథంతో వ్యవహరించి నిర్ణయం తీసుకోవాలన్నారు.