వర్రా రవీందర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

82చూసినవారు
వర్రా రవీందర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు ప్రొద్దుటూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రొద్దుటూరులో నమోదైన కేసులో పీటీ వారెంట్‌పై ఆయనను కడప నుంచి తీసుకెళ్లి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. వర్రా రవీందర్ రెడ్డిపై వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా 40 కేసులు నమోదయ్యాయి. వర్రా రవీందర్ రెడ్డి కేసులో నెల్లూరు, భీమవరానికి చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్