వైద్యుడిని భయపెట్టి రూ.2 కోట్లను దోచుకున్న సైబర్ నేరగాళ్లు
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఓ ప్రైవేటు వైద్యుడిని మోసం చేసి సైబర్ నేరగాళ్లు రూ.2 కోట్లు స్వాహా చేశారు. మీ పేరుపై లండన్ నుంచి డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని.. నిన్ను అరెస్ట్ చేయబోతున్నాం అంటూ పోలీస్ యూనిఫాంలో వీడియో కాల్ చేసి డాక్టర్ను సైబర్ నేరగాళ్లు బెదిరించారు. కేసు నుంచి నిన్ను తప్పించాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇదంతా నిజమేనని నమ్మిన డాక్టర్ వారిచ్చిన అకౌంట్లకు మొత్తం రూ.2 కోట్లు పంపించాడు.