మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పాలి: నటి కుష్బూ
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, నటి కుష్బూ స్పందించారు. ‘సురేఖ గారూ.. మీలోని విలువలు ఏమైపోయాయి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు సినీ పరిశ్రమపై భయంకరమైన, కించపరిచే ప్రకటనలు చేయరాదు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తూ కూర్చోదు. మీరు సినీ పరిశ్రమ మొత్తానికి, అందులోని మహిళలకు క్షమాపణలు చెప్పాలి’ అని X వేదికగా డిమాండ్ చేశారు.