మంత్రి సురేఖ కామెంట్స్.. స్పందించిన Jr.ఎన్టీఆర్

74చూసినవారు
మంత్రి సురేఖ కామెంట్స్.. స్పందించిన Jr.ఎన్టీఆర్
ఇతరులు తమపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోలేమని Jr.NTR అన్నారు. నాగ చైతన్య-సమంత విడాకులపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. 'వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని, గోప్యతను పాటించాలి. సినీ పరిశ్రమ గురించి నిరాధారమైన ప్రకటనలు చేయడం బాధించింది. ఇలాంటి వాటిని ఫిల్మ్ ఇండస్ట్రీ సహించదు' అని Xలో ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్