ఇంటిపై విరిగిపడిన కొండచరియలు.. కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్
విజయవాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పట్టపగలు కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న నలుగురు శిథిలాల కింద ఇరుక్కుపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ ముగ్గురిని సేఫ్గా బయటకు తీసుకొచ్చారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మరో వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.