'ఏదో చేయాలనుకుంటే.. ఇంకేదో అయినట్లు' అనే సామెత తీరుగా ఓ బాలుడు వినూత్నంగా ఆలోచించి, చివరికీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఓ బాలుడు స్విమ్మింగ్‌పూల్ వద్ద స్నానం చేస్తూ రీల్ వీడియో చేద్దామనుకున్నాడు. అయితే దీనికోసం స్విమ్మింగ్‌పూల్‌లోకి వెనక్కు జంప్ చేయాలనుకున్నాడు. వెనక్కి బ్యాక్ ఫ్లిప్ చేస్తున్న సమయంలో కాలుజారడంతో.. ఆ పూల్‌కి, చెక్కల మధ్య ఇరుక్కుపోయాడు. ఆ తర్వాత బయటకు రాలేక నానా ఇబ్బందులు పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.