భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ ఛార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డితో సహా పలువురు స్థానిక బీజేపి నాయకులు బుధవారం జిల్లా కేంద్రంలోని న్యాయస్థానానికి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ గతంలో ఓపెన్ కాస్ట్ కాంట్రాక్టు కార్మికుల అక్రమ తొలగింపు, వారి సమస్యలపై ప్రశ్నించినందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో భాగముగా కోర్టుకు హాజరైనట్లు పేర్కొన్నారు. హాజరైన వారిలో వెన్నంపల్లి పాపయ్య, తదితరులు ఉన్నారు.