Apr 07, 2025, 05:04 IST/
రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి
Apr 07, 2025, 05:04 IST
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సంబేపల్లి మండలం యర్రగుంట్ల దగ్గర రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవీ మృతిచెందగా.. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, పీలేరు నుంచి రాయచోటి కలెక్టరెట్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.