ప్రపంచ దేశాలపై ట్రంప్ సుంకాల మోత మోగించారు. న్యూఢిల్లీ నుంచి దిగుమతి చేసుకొనే ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో ట్రంప్ సుంకాలకు ప్రతీకారంగా భారత్ కూడా టారిఫ్‌లు పెంచే అవకాశం ఉందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి, దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు స్పందిస్తూ మన నుంచి ఎలాంటి ప్రతిచర్య ఉండబోదని తెలిపారు. టారిఫ్‌ల నేపథ్యంలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయన చెప్పారు.