VIDEO: సార్.. షాప్‌ను కూల్చేసి మా బతుకు తెరువుపై దెబ్బకొట్టొద్దు
TG: రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీంతో సామాన్యులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని ఓ సెలూన్ షాప్‌ను కూల్చివేయడంతో బాధితుడి ఆవేదన పలువురిని కంటతడి పెట్టించింది. ప్లీజ్.. నా షాప్‌ను కూల్చకండి సార్.. బతుకు తెరువుపై కొట్టొద్దని వేడుకున్నారు. జేసీబీకి అడ్డంగా పడుకొని నిరసన తెలిపాడు. అయినా అధికారులు షాప్‌ను నేలమట్టం చేశారు.