AP: కూటమి పాలనలో ఆరోగ్య సేవలు అటకెక్కాయని వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని ఆరోపించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘ఆంధ్ర రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా, మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. కానీ కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీని పక్కన పెట్టింది. కొత్త మెడికల్ కాలేజీలు లేవు. ఫ్యామిలీ డాక్టర్లు లేరు. 108, 104 సేవల ఊసే లేదు.’ అని అన్నారు.