బ్రెజిల్ వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా వివిధ దేశాల అధినేతలతో ప్రధాని మోదీ భేటీ అవుతున్నారు. ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత్కు అప్పగించాలని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో మోదీ కోరారు. వారితో పాటు పన్ను ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యవర్తి సంజయ్ భండారీని కూడా రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.