ములుగు: దరఖాస్తులను పరిష్కరించాలి: ఐటీడీఏ పీఓ

గిరిజన దర్బారులో సమర్పించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని మంగళవారం ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా అన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బారులో గిరిజనులు సమర్పించిన దరఖాస్తులను పీఓ స్వీకరించారు. వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 20 దరఖాస్తులు వచ్చాయని, వాటిని సంబంధిత శాఖల అధికారులకు సమర్పించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.