ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఎలిశెట్టిపల్లి - చల్పాక మధ్య జంపన్నవాగుపై ఎట్టకేలకు ఆర్&బీ ఆధ్వర్యంలో బ్రిడ్జి నిర్మాణం కోసం బుధవారం మట్టి పరీక్షలు ప్రారంభమయ్యాయి. గాయత్రి కన్స్ట్రక్షన్స్ కు చెందిన కార్మికులు బోరు పైపుల ద్వారా పిల్లర్ మార్కింగ్ వద్ద మట్టి తవ్వకాలు చేపట్టారు. తీసిన మట్టిని హన్మకొండలోని ల్యాబ్ కు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా 3 మీటర్ల లోతులో మట్టి లభించిందన్నారు.