శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు
శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు అందించనున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల మేరకు మెనూలో మార్పులు చేశారు. సోమవారం ట్రయల్ రన్లో భాగంగా 5 వేల మసాలా వడలను భక్తులకు సిబ్బంది వడ్డించారు. ఉల్లి, వెల్లులి లేకుండా మసాలా వడలు తయారు చేశారు. ఇవి రుచికరంగా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. వీటిలో లోటుపాట్లను సరిచేసి.. మెనూలో మార్పులు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది.