నర్సంపేట మండలం మహేశ్వరం శివారులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పట్టుకున్న గంజాయి 5 కేజీల పైనే ఉంటుందని సమాచారం. నిందితుల్లో ఒకరు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి పోలీస్టేషన్ లో కోర్టు కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న రవి, మరొకరు నర్సంపేట మండలం పర్శునాయక్ తండాకు చెందిన మనోహర్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.