ఏపీలో ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ, కొన్ని చోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నానికి పుదుచ్చేరి వద్ద తుఫాన్ తీరం దాటనుంది. దీంతో గంటకు 90 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.