శబరిమల అయ్యప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మండల దీక్ష చేసిన అయ్యప్ప దీక్షా స్వాములతోపాటు వేలాదిగా భక్తులు శబరిమలకు తరలివస్తున్నారు. పెద్ద సంఖ్యలో మాలధారులు రావడంతో స్వామివారి దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పడుతోంది. సన్నిధానం నుంచి పంబ వరకు అయ్యప్ప భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. గతేడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలివస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.