
జగన్ ఐడియాకు చెక్ పెట్టిన కూటమి?
AP: గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ఏర్పాటుకు కృషి చేసిన విషయం తెలిసింది. విశాఖను కార్యనిర్వాహక, అమరావతిని శాసన, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. వీటిలో ఏ ఒక్కటీ అమలు కాకుండానే ప్రభుత్వం మారిపోయింది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలకు కూటమి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. మూడు రాజధానుల్లో న్యాయ రాజధానిగా గత జగన్ ప్రభుత్వం ఎంచుకున్న కర్నూలులో ప్రభుత్వం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనుంది.