వారానికి నాలుగు రోజులే పని.. జపాన్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం
జపాన్ ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని పేర్కొంది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జపాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణుబాంబులు జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలను నేలమట్టం చేసినా.. పట్టుదలతో ముందడుగు వేస్తూ అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ ఒకటిగా నిలిచింది.