తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ మేరకు బాధితులను మంత్రులు అనిత, ఆనం, అనగాని, పార్థసారథి పరామర్శించారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారాన్ని మంత్రి అనిత ప్రకటించారు. అనంతరం క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని బాధితులకు హమీ ఇచ్చారు.