రాష్ట్రానికి ఐకాన్ గా భువనగిరి ఖిల్లా
తెలంగాణ పర్యాటక రంగంలో భువనగిరి ఖిల్లా ఐకాన్ గా మారనున్నదని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్వదేశి దర్శన పథకానికి ఎంపికైన భువనగిరి ఖిల్లాపై చేపట్టనున్న అభివృద్ధి పనులపై బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి విడతలో రూ. 100 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నట్లు మలి విడతలో మరిన్ని నిధులు రానున్నట్లు తెలిపారు. డీపీఆర్ చేపట్టబోయే పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.