
భువనగిరి: చలివేంద్రాన్ని ప్రారంభించిన కార్మిక శాఖ అధికారి
కార్మికులు వేసవి కాలంలో పనిచేసే చోట తగు జాగ్రత్తలను పాటిస్తూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా కార్మిక శాఖ అధికారి మొయిజ్ఉద్దీన్ కార్మికులకు సూచించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జగదేవ్ పూర్ చౌరస్తాలోని లేబర్ అడ్డ వద్ద కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని జిల్లా కార్మిక శాఖ అధికారి మొయిజ్ఉద్దీన్ ప్రారంభించారు.