జమ్మూలో యాత్రికుల బస్సు బోల్తా, తొమ్మిది మందికి గాయాలు (వీడియో)
జమ్మూలో రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయం నుంచి యాత్రికులతో కత్రా నుంచి జమ్మూ వెళ్తున్న బస్సు.. శనివారం కత్రాలోని దోమైల్ సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో తొమ్మిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.