ఆరోగ్యంగా ఉండడానికి మనం ప్రతి రోజూ పాలు తీసుకుంటుంటాం. కానీ పాలు అప్పుడప్పుడు త్వరగా చెడిపోతుంటాయి. అయితే చిన్న చిన్న చిట్కాలతో పాలను ఎక్కువసేపు నిల్వ చేయొచ్చు. పాలు విరిగిపోకుండా ఉండాలంటే ముందు వాటిని బాగా మరగబెట్టాలి. పాలు సరిగా మరగకపోతే బ్యాక్టిరియాలు సజీవంగా ఉండి పాలు విరిగిపోతాయి. అలాగే ఈ పాలను స్టీల్ పాత్రలో కాకుండా మట్టి పాత్రల్లో లేదా గాజు పాత్రల్లో ఉంచడం వల్ల ఎక్కువ సేపు నిల్వచేయొచ్చు.