మిరియాలు తింటే జలుబు, దగ్గు సమస్యలకు చెక్
మిరియాలు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల మిరియాల్లో యాంటీ మైక్రోబయల్, యాంటీ అలెర్జిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ గ్యాస్, డైయూరిటిక్, డైజెస్టివ్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను, రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి కాపాడుతాయి. జలుబు, దగ్గు సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.