పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావుడి చేస్తే బొక్కలో వేయండి: సీఎం రేవంత్
ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావుడి చేస్తే చక్కగా తీసుకెళ్లి బొక్కలో వేయండి అని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. పోలీసులంటే నేరగాళ్లు భయపడాల్సిందేనన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన ఏ ప్రజాప్రతినిధి అయినా మర్యాదగా వ్యవహరించాలన్నారు. పేదలు, సామాన్యులు, బాధితులకు పోలీసులు అండగా ఉండాలన్నారు. నేరగాళ్ల హోదా చూసి పోలీసులు వెనక్కి తగ్గొద్దని అన్నారు. విధి నిర్వహణలో మరణించిన అధికారులు, పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం తెలిపారు.