AP: కోనసీమ జిల్లా రాయవరం మండలం చెల్లూరు ఎస్సీ కాలనీలో 'పుష్ప-2' సినిమా ఫ్లెక్సీపై మాజీ సీఎం జగన్ ఫొటో ఏర్పాటు చేశారు. వాటిని తొలగించాలన్న ఫిర్యాదు నేపథ్యంలో టీడీపీ నేతలు చుండ్రు వీర్రాజు, గ్రామ 8వ వార్డు సభ్యుడిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రాయవరం పోలీసులు కేసు నమోదు చేశారు.