తొందర్లోనే APSRTCకి 1,050 ఈవీ బస్సులు: CM (వీడియో)

AP: అనకాపల్లిలో గ్రీన్ ఎనర్జీపై ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో పునరుత్పాదక శక్తి అభివృద్ధికి రూ.1.85 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. త్వరలో APSRTCకు 1,050 ఎలక్ట్రిక్ బస్సులు అందించనున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో అన్ని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్‌గా (ఏసీ బస్సులుగా) మార్చే ఆలోచనలో ఉన్నట్టు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నాం అని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్

✕
✕