AP: అమరావతిలో ఈ నెలలోనే 2 కీలక ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు. సీడ్ యాక్సిస్ రహదారిని ప్రారంభించడంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. వర్షాకాలంలోనూ అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. నెలాఖరులోగా వెలిగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులను అనకాపల్లి వరకు సాకారం చేస్తామని, వచ్చే ఏడాది విశాఖ వరకు నీటిని తీసుకెళ్లేలా చర్యలు చేపడతామని సీఎం తెలిపారు.