20 నోటిఫికేషన్లు విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే?

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 892 ఉద్యోగాల భర్తీకి 20 నోటిఫికేషన్లను విడుదల చేసింది. గ్రూప్ 1 సర్వీసులకు 163 పోస్టులు, ఇతర విభాగాలకు 729 పోస్టులు కేటాయించారు. APPSC అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. గ్రూప్ 1 జాబితాలో MPDO పోస్టు తొలగించి, DLDO, DSP కమ్యూనికేషన్స్, DEO పోస్టులను చేర్చారు. ఫారెస్ట్, మహిళా అభివృద్ధి, పరిశ్రమలు, ఎండోమెంట్స్, కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్, గిరిజన సంక్షేమం, ఆర్థిక-గణాంకాలు, సోషల్ వెల్ఫేర్ వంటి విభాగాల్లోనూ పోస్టులున్నాయి. సాధారణ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పెంచారు.

సంబంధిత పోస్ట్

✕
✕