ఆస్తి పన్ను వడ్డీలో 50% రాయితీ.. ఇవాళే లాస్ట్

AP: ఆస్తి పన్ను చెల్లింపుదారులకు అలర్ట్. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను వడ్డీపై ప్రభుత్వం 50% రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ్టితో గడువు ముగియనుంది. గత ఎనిమిదేళ్లుగా ఈ బకాయిలు రూ.2,636 కోట్లుకు చేరాయి. వడ్డీ మాత్రమే రూ.3,436 కోట్లు ఉంది. అంటే మొత్తం కలిపి ప్రజలు రూ.6,072 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలి. 50 శాతం వడ్డీ రాయితీ ఇవ్వడంతో ప్రజలకు రూ.1,718 కోట్ల లబ్ధి చేకూరనుంది.

సంబంధిత పోస్ట్