వేటకు వెళ్లని మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కిలోల బియ్యం: చంద్రబాబు

AP: భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరదల నేపథ్యంలో CM చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం ఉచితంగా అందించాలని ఆదేశించారు. వరదలపై అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పలు జిల్లాల్లోని రిజర్వాయర్లలో నీటి ప్రవాహాలపై అధికారుల నుంచి సమాచారం అందుకున్నారు. తాజా వర్షాలతో వర్షపాతం లోటు 50% నుంచి 31%కి తగ్గిందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕