ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభం కారణంగా మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 14, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 44 విమానాలు రద్దయ్యాయి. విశాఖ నుంచి బెంగళూరు, హైదరాబాద్‌కు వెళ్లే 6 ఇండిగో సర్వీసులు కూడా రద్దు చేయబడ్డాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా స్పైస్‌జెట్ వంద అదనపు విమానాలను అందుబాటులోకి తెచ్చింది. రైల్వే, తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాయి.