AP: శాసనసభలో రాష్ట్రప్రభుత్వం సోమవారం ఏడు బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పంచాయతీరాజ్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ భూఆక్రమణల నిరోధక బిల్లు, ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ సొసైటీ బిల్లు, మున్సిపల్ లా బిల్లు, డా.ఎన్టీఆర్ ఆరోగ్యవిశ్వవిద్యాలయానికి సంబంధించిన బిల్లులు సభ ముందుకు రానున్నాయి.