వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పర్సనల్ బాండ్‌తో పాటు రూ.25వేల పూచీకత్తులు రెండు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి శనివారం పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఉదయ్‌కుమార్, శివశంకర్‌రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఎంపీ అవినాశ్‌‌కు ముందస్తు బెయిల్‌‌ లభించింది.

సంబంధిత పోస్ట్