ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో బీసీలకు రక్షణ చట్టం..!

AP: రాష్ట్రంలో బీసీల రక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగానే ఒక కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ చట్టంపై రెండేళ్లపాటు అధ్యయనం చేసి, దేశంలో ఎక్కడా లేని విధంగా దీనిని రూపొందించింది. తాజాగా విజయవాడలో మంత్రి సవిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. బీసీ చట్టం బిల్లును ఇప్పటికే కేంద్రానికి పంపామని, అసెంబ్లీలో ముసాయిదా బిల్లును ఆమోదించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్