ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ గజరాజుల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న ఆరు కుంకీ ఏనుగులకు ఆధార్ తరహా గుర్తింపు కార్డులు అందించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల కోసం ఏనుగుల వివరాలను సేకరించి, వాటిని డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపారు. ఫలితాలు వెలువడిన తర్వాత గుర్తింపు కార్డులు తయారు చేసి ఏనుగులకు తగిలిస్తారు. భవిష్యత్తులో వైద్యం, జన్యుపరమైన సమస్యల గుర్తింపునకు ఈ కార్డులు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.